Header Banner

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు గల్ఫ్ నుంచి మద్దతు! ప్రవాసులు విస్తృత ప్రచారం!

  Sun Feb 23, 2025 20:51        Politics

తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఆదేశానుసారం గల్ఫ్ కౌన్సిల్ శ్రీ రావి రాధాకృష్ణ మరియు ఎన్నారై విభాగం కోఆర్డినేటర్ రాజశేఖర్ గారి సూచనల మేరకు సౌదీ అరేబియాలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీ వడ్లమూడి సారధి నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థవంతమైన పాలనకు మరింత మద్దతు ఇవ్వడానికి ఈనెల 27వ తారీఖున కృష్ణా, గుంటూరు,తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి మరియు శ్రీ పేరా బత్తుల రాజశేఖర్ గారికి విలువైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినదిగా సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్లమూడి సారధి నాయుడు సౌదీ అరేబియాలో ప్రచారం నిర్వహించారు.


ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమల పరుస్తున్న పథకాలను వివరిస్తూ, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించుట కొరకు పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అణగారిపోయిన ఆంధ్రప్రదేశ్ ని సంక్షేమం మరియు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. విజ్ఞానవంతులైన పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేయుచున్న శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మరియు పేరాబత్తుల రాజశేఖర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని బంధు వర్గంలోని పట్టభద్రులకు మరియు పట్టభద్రులైన స్నేహితులకు తన తోటి కృష్ణ గుంటూరు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రవాస భారతీయుల చేత చరవాణి ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి సురేష్,నరేంద్ర, శ్రీనివాసరావు, నరేష్తదితరులు పాల్గొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #mlc #elections #campaign #todaynews #flashnews #latestupdate